బెగ్గింగ్‌ కూడా ఉద్యోగమేనా..? | Sakshi
Sakshi News home page

బెగ్గింగ్‌ కూడా ఉద్యోగమేనా..?

Published Sun, Jan 28 2018 7:23 PM

If selling 'pakodas' is a job, so is begging  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పకోడాలు అమ్ముకోవడం ఉద్యోగమైతే యాచించడాన్నీ ఉపాధిగా గుర్తించండని మోదీ సర్కార్‌పై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలను కల్పించడంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ప్రధాని చెప్పినట్టుగా పకోడాలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అయితే యాచించడమూ అలాంటిదే అవుతుంది...పేద, వైకల్యంతో కూడిన వారు బలవంతంగా యాచకవృత్తిలోకి నెట్టబడ్డవారినీ ఉద్యోగులుగా లెక్కించండంటూ వరుస ట్వీట్లతో సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీ ఇటీవల ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి పకోడాలు అమ్ముతూ రోజుకూ రూ 200 ఇంటికి తీసుకువెళితే అది ఉపాధి కాదా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలపై చర్చ సందర్భంగా జాబ్స్‌, స్వయం ఉపాధికి మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చిదంబరం ట్వీట్‌ చేశారు. భద్రతతో కూడిన ఉద్యోగాలు ఎంత మందికి అందుబాటులోకి తీసుకువచ్చారో వెల్లడించాలని కోరారు. ఉపాథి హామీ కార్మికులనూ ప్రభుత్వం ఉద్యోగులుగా లెక్కగడుతోందని చిదంబరం ఆక్షేపించారు.

Advertisement
Advertisement